మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే,

మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే, ఆయన రక్తంలో చక్కెరపాళ్లు 290, ట్రైగ్లిసరైడ్స్ కొవ్వులు 611 వచ్చాయి. ఆయన గత ఐదేళ్లుగా చక్కెర నియంత్రణ కోసం మందులు వాడుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు కూడా పాటిస్తుంటారు. కానీ మా నాన్నగారు వృత్తిరీత్యా చాలా ఒత్తిడిలో ఉంటారు. దయ చేసి ఆయన ట్రైగ్లిజరైడ్స్ తగ్గడం కోసం తగిన చికిత్స సూచిం చగలరు.
ఎ. హైదరాబాద్

ఆయన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. . అయితే కేవలం ఈ ఒక్క రిపోర్టు ఆధారంగా వెంటనే ఆయన చక్కెరపాళ్లు అనియంత్రితంగా ఉంటున్నా. యని నిర్ధారణ చేయలేం. ఆయనకు మరోసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో పాటు హెచీబీఏ1సీ పరీక్ష చేయించండి. దీని వల్ల గత మూడు నెలల్లో మీ నాన్నగారి షుగర్ పాళ్ల సరాసరి వివ రాలు తెలుస్తాయి. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్షల్లో రిపోర్టులు 128 కంటే ఎక్కువగానూ, హెచ్బీఏ1సీ పరీక్షలోని విలువ 7 కంటే ఎక్కువగానూ ఉంటే, అప్పుడు షుగర్ నియంత్రణ కోసం నోటి ద్వారా తీసుకునే మరో మందు వాడవచ్చు. ఇక ట్రైగ్లిసరైడ్స్ మాత్రమే గాక ఆయనలో అన్ని రకాల కొవ్వుల రీడింగ్స్ (లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రిపోర్టులు) అవసరం. అన్ని కొవ్వులు కలుపుకున్న రిపోర్డు 200 కంటే తక్కువగా ఉండాలి. అది సాధించ డానికి ఆయన రక్తంలో కొవ్వుల పాళ్లను నియంత్రిం చాలా మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఆ పరీక్షలు చేయించి, ఆ రిపోర్టులతో ఫిజీషియన్ ను కలవండి..

నా వయసు 27 ఏళ్లు. నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవా లని అనుకుంటున్నాను. నా హెచ్బీఏ1సీ విలువ నార్మ ల్గానే ఉంది. కానీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) పరీక్ష రిపోర్టులు మాత్రం అనుకూలంగా రాలేదు. నేను ప్రస్తుతం గ్లైకోమెట్ 500 ఎంజీ మందును రోజుకు రెండుసార్లు వాడుతున్నాను. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.

  • సుగుణ, కాకినాడ

మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు రక్తంలో చక్కెర పాళ్లు విలువలు నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి. మీరు వాడే మెటా ఫార్మిన్ మందును ఆపేసి, ఆహార నియమాలు: పాటించడం ద్వారా మీ చక్కెర పాళ్లను నార్మల్ గా ఉంచుకో వచ్చు. మీరు గర్భం ధరించాక అవసరాన్ని బట్టి మళ్లీ మీ మందుల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. ఒకవేళ మందు లతో మీ చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే (మరీ ముఖ్యంగా గత మూడు నెలల విలువలు) అప్పుడు మీకు అవసరాన్ని బట్టి ఇన్సులిన్ వాడాల్సి రావచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *