అంతగా నియంత్రణలో లేని మధుమేహం ఇతర కీలక అవయవాలతో పాటే పాదాలనూ తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్రత్యేకించి పాదాల్లోని గాంగ్రిన్ సకాలంలో చికిత్స అందక తీవ్రమైతే కొన్నిసార్లు మొత్తంగా కాలే తీసివేయాల్సి రావొచ్చు. పరిస్థితి విష మిస్తే ఒక్కోసారి అది ప్రాణాపాయానికే దారి తీయవచ్చు. కాస్తంత రక్తం ఇచ్చి షుగర్ నిలువల్ని పరీక్షలు చేయించుకోడం ఒక్కటే సరి పోదు. సర్శ కోల్పోయిన పాదాలు ఎలా ఉన్నాయో ప్రతినిత్యమూ పరీక్షించుకోవాలి. ఏ కాస్త తేడా కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్ర దించాలంటున్నారు, మధుమేహ వైద్య నిపుణులు…
మధుమేహం ఉన్నట్లు తెలిసిన తొలిరోజున అందరూ భయంతో వణికిపోయిన వాళ్లే. కానీ వారిలో కొందరు పాదాలకు పుండ్లు (గాంగ్రిన్) పడుతున్నా పట్టించుకోరు. అదే ఆశ్చర్యం. ఇంతకీ ఈ గాంగ్రిన్ కథా కమామిషూ ఏమిటంటారా? చర్మంలో ఇన్ఫెక్షన్లు వచ్చి అక్కడున్న కణజాలమంతా క్షీణించి, చీము ఏర్పడటాన్నే గాంగ్రిన్ అంటారు. వెబ్ అంటూ ఇందులో రెండు రకాలు, వెబ్ గాంగ్రిన్ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లోనే వస్తుంది. షుగర్ నిలువలు ఎక్కువైనప్పుడు ఇన్ఫెక్షన్లు ఎక్కువై అక్కడున్న కణజాలమంతా క్షీణించి తడిలేకుండా నల్లబడి ఆ తర్వాత ఆ బాగ మంతా మాడిపోతుంది. మధుమేహంతో కాకుండా ఇతర కారణాలతో వచ్చే సమస్యను డ్రై ఇది రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు వచ్చే సమస్య ఇవి కాక గ్యాస్-గాంగ్రిన్ అని కూడా ఒక సమస్య ఉంటుంది. ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల వ స్తుంది. నాలుగవది ఫోర్నియర్స్ గాంగ్రిన్ ఇది కూడా వెట్- గాంగ్రిన్ కు సంబంధించిందే కాక పోతే ఇది పాదాల్లో కాకుండా గజ్జల భాగంలో ఎక్కువగా వస్తుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యే ఆ భాగాన్ని సర్జరీ ద్వారా వెంటనే తొలగించి అవసరమైన వైద్య చికిత్సలు అందించక పోతే శరీరమంతా పాకే ప్రమాదం ఏర్పడుతుంది.
గాంగ్రిన్ రావడానికి ముందు అంటే తొలిదశలో రక్తసరఫరా సరిగా అందకపోవడం వల్ల ఆ ప్రదేశంలో కొంచెం తెల్లగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కొంత ఇన్ఫెక్షన్లు కూడా మొద
గాంగ్రిన్ చికిత్సలో ఆధునిక విధానాలెన్నో వచ్చాయి. ముఖ్యంగా దెబ్బతిన్న కణజాలం, నరాలు చక్కబడటానికి సర్జన్లు హార్మోన్లలాంటి గ్రోత్ ఫ్యాక్టర్లను వాడటంఅందులో ఒకటి. • అదీ కాకపోతే ఎక్కువ ఒత్తిడితో ఆక్సీజన్ పంపడం ద్వారా గాయాన్ని మాన్పే ప్రయ త్నం ఉంటుంది.
- నెగెటివ్ ప్రెషర్ ద్వారా గాయం చుట్టూ శూన్యాన్ని ఏర్పాటు చేసి గాయాన్ని మాన్సే. ప్రయత్నం ఉంటుంది.
• కొంత మంది పోటో బయో మాడ్యులేషన్ అనే టెక్నిక్ కూడా వాడుతున్నారు. • ఒక ప్రత్యేకమైన స్థాయిలో లైటును ఉంచి గాయాన్ని మాన్నే ప్రయత్నం మరో విధా నం అయితే ఇవన్నీ ఇంకా ప్రయోగాత్మక స్థాయిలో ఉన్నాయి.
లైతే కాస్త వాపు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ భాగం ముందు ముదురు గోధుమ రంగులోకి ఆ తర్వాత నలుపు రంగులోకి మారుతుంది. అక్కడ చీము కూడా చేరుతుంది. అక్కడుండే కణజాలంలో ఆరోగ్యకరమైన వాటికీ, ఆనారోగ్యకరమైన వాటికీ మధ్య ఒక ఎర్రని రేఖ ఉంటుంది. దానికి వెనుకున్న భాగం ఆరోగ్యకరంగానూ. దానికి ముందున్నది అనారోగ్యకరం. గానూ ఉంటుంది. ఆ భాగానికి దాదాపు రక్తప్రసరణ పూర్తి ఆగిపోతుంది. సకాలంలో చికి అందించని కారణంగా అది లోలోపలికి వ్యాపిస్తుంది. ముందు ఏదో ఒక వేలికే వచ్చిన సమస్య మొత్తం మోకాలి దాకా వెళ్లవచ్చు. ఆ క్రమంలో ఒక్కోసారి మొత్తంగా మోకాలి దాకా తీసివేయవలసి రావచ్చు. గాంగ్రిన్ చికిత్సలో సాధారణంగా చనిపోయిన కణజాలాన్ని తొల గించడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, విశ్రాంతి నివ్వడం, అవసరమైనప్పుడు సర్జరీ
చేయడం ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే ఆవయవాన్ని తొలగించే యాంపుటేషన్ దాకా రా కుండా గాంగ్రిన్ను నయం చేసే ఎన్నో వైద్య విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే పరిస్థితి బాగా విషమించేదాకా నిర్లక్ష్యంగా ఉండిపోతే ఆ తర్వాత యాంపుటేషన్ త ప్ప మరో మార్గం ఏమీ ఉండదు. ఎందుకంటే గాంగ్రిన్ ఎక్కువ కాలం దాకా కొనసాగితే దా ని దుష్ప్రభావం మొత్తం శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. గాంగ్రిన్ వచ్చే కారణాలేమిటి?
మధుమేహం వల్ల ప్రధమంగా నరాలు దెబ్బతింటాయి. దీన్నే న్యూరోపతి అంటారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో వచ్చే న్యూరోపతి మూడు రకాలు. సెన్సరీ న్యూరోపతి
ఇది స్పర్శను తెలియచేసే నరాలు దెబ్బ తినడం. దీనివల్ల ఏది గుచ్చుకున్నా నొప్పి తెలి యదు. చలి. వేడి కూడా తెలియవు. దీని వల్ల కాలికి దెబ్బ తగిలినా వారు దానికి స్పందించ లేదు. నేరుగా ముళ్లుమీద లేదా మొల మీద కాలు పెట్టినా వారికి ఏమీ తెలియదు. తెలియ -కుండానే ఆ గాయం పెద్దడై చివరికి పుండుగా మారే స్థితి ఏర్పడుతుంది. మోటార్ న్యూరోపతి
మధుమేహం వల్ల కాళ్ల పనితనానికి సంబంధించిన అంటే కండరాలను నియంత్రించే నరాలు దెబ్బతినడాన్ని మోటార్ న్యూరోపతి అంటారు. ఈ స్థితిలో నరాలు బాగా దెబ్బతిం టాయి. దీని వల్ల కదలికల్లో అంతరాయం ఏర్పడుతుంది. కాలి వేళ్ల ఆకృతి దెబ్బతిని అక్కడే ఆల్బర్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
అటానమిక్ న్యూరోపతి
మధుమేహంలో కాళ్లకు రక్తప్రసరణను అందించే నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల కాళ్లకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీనినవల్ల ముందు పుండు తయారై వెంటనే చికిత్స అందక పోతే అది గాంగ్రెస్గా మారే స్థితి ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే వీరిలో రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల కిడ్నీలు, కళ్లు, గుండె, మెదడు దెబ్బతినవచ్చు. రక్తసరఫరా సరిగా లేకపోవడం. వల్ల కాళ్లల్లో ఏర్పడిన అల్సర్లు చాలా కాలం దాకా మానవు. మధుమేహం వల్ల వచ్చే మరో ప్రధాన సమస్య వ్యాధినిరోదక శక్తి తగ్గిపోవడం. దీని వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్లు అంత తొంద రగా తగ్గవు. వయసు పైబడే కొద్ది వీరిలో అల్స్టర్, గాంగ్రిన్ సమస్యలు ఎక్కువవుతాయి. “అంతకు ముందే రక్తనాళాలకు ఎథిరోస్ క్లిరోసిస్ వంటి రక్తనాళాల సమస్యలు ఉన్నవారికి మధుమేహం వస్తే ఆ జబ్బులు తీవ్రమై గాంగ్రిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎథిరోస్ క్లిరో సిస్ అనే నరాల సమస్య మధుమేహం వల్ల రావచ్చు. వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. రక్తనాళాల్లో బర్గర్స్ డిసీస్ ఉన్నవారికి మదుమేహం వస్తే ఆ సమస్య మరింత తీవ్రమవు తుంది. పొగతాగడం వల్ల మధుమేహుల్లో గాంగ్రిన్ రావడానికి గల అతి ప్రధాన కారణం.
రక్తనాళాలకు సంబందించిన ఏ వ్యాధి ఉన్నా పొగతాగడం ద్వారా అది తీవ్రమవుతుంది. ఆశ్చర్యమేమంటే మధుమేహవ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది పొగతాగే వారే ఉంటారు. అందుకే ముందుగా వారికి ఆ ప్రశ్న వేస్తాం. మధుమేహుల్లో చాలా మంది కాలికి తగిలిన దెబ్బల్ని చిన్న దెబ్బే కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతారు. ఒకవేళ డాక్టర్ను కలిసినా ఓ 15 రోజుల పాటు చికిత్స తీసుకుని పైపైన కొంత మానినట్లు అనిపించగానే చికిత్సల్ని ఆపేస్తారు. సాధారణంగా ఒక అల్సర్ మానడానికి 3 నుంచి 6 మాసాల దాకా పడుతుంది. అల్సర్ రాగానే కొద్ది రోజుల దాకా నడవడం మానేయమని చెబుతాం. ఆ మాటను పట్టించు కోరు. నడిచే కొద్దీ ఆర్ ఇంకా ఇంకా పెరుగుతుంది. చనిపోయిన కణజాలాన్ని సర్జరీ ద్వారా తొలగించాక కాలుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అల్సర్ పూర్తిగా మాను తుంది.
వైద్య చికిత్సలు
ముందుగా షుగర్ నిలువల్ని, కొలెస్ట్రాల్ పరిస్థితుల్ని పరీక్షించాలి. చీము విషయంలో పస్ కల్చర్ కూడా తీసుకోవాలి. గాంగ్రిన్తో వచ్చిన వాళ్లల్లో 90 శాతం మందిలో నరాల వ్యాధులు ఉంటాయి. అవి ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షించాలి. రక్తప్రసరణలో అంతరాయాలు కూడా వీరిలో ఎక్కువే. అయినా ఒకసారి డాప్లర్ పరీక్ష చేయిస్తే మేలు, సమస్యను గుర్తించాక ముందుగా షుగర్ను నియంత్రించే వైద్య చికిత్సలు అందించాలి. ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. కొలెస్ట్రాల్ పరమైన సమస్యలు ఉంటే వాటికీ వైద్యం చేయాలి. అదే సమయంలో రక్తప్రసరణను పెంచే మందులు కూ డా ఇవ్వాలి. గాంగ్రీన్ కారణంగా దెబ్బతిన్న భాగాన్నంతా తీసివేసి, రోజూ గానీ, రోజు విడిచి రోజు గానీ డ్రెస్సింగ్ చేస్తాం. ఆ పాదం మీద ఏమాత్రం బరువు మోపకుండా చూస్తాం. వాస్తవానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే 99 శాతం మందిని యాంపు టేషన్ దాకా వెళ్లకుండా కాపాడవచ్చు. ఆ జాగ్రత్తలో భాగంగా మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తీ ఏమైనా గాయాలు ఉన్నాయేమో. పుండ్లు ఏర్పడ్డాయేమో ప్రతిరోజూ చూసుకోవాలి. స్పర్శజ్ఞానం పోవడం వల్ల నొప్పి ఉండదు కాబట్టి కంటితోనే గమనించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి కాలి వేళ్ల మధ్య మడిమ వద్ద ఏమైనా పుండ్లు ఉన్నాయేమో చూసుకోవాలి. ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సాక్స్, చెప్పులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకూడదు. అన్నింటినీ మించి నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణ. ఉంటూ షుగర్ నిలువలు ఎల్లవేళలా నియంత్రణలో ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ముందే వైద్య చికిత్సలకు వస్తే అల్సర్లనూ, గాంగ్రిన్లనూ నయం చేయడం ఈ రోజుల్లో పెద్ద విషయమేమీ కాదు. సమస్య అంతా వాటిని చాలా కాలం దాకా పట్టిం చుకోకపోవడంతోనే ఉంది. నిండు జీవితం జీవించాలంటే పరిపూర్ణ మైన శ్రద్ధ ఎంతో అవసరం.
డాక్టర్. వి. శ్రీ నగేష్
కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్టు కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్
హైదరాబాద్